అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు.

Published : 28 Apr 2024 04:58 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. 1972లో జరిగిన కారు ప్రమాదంలో బైడెన్‌ మొదటి భార్య, కుమార్తె మరణించారు. ఆ ఘటన తర్వాత తాను మానసికంగా కుంగిపోయానని బైడెన్‌ తెలిపారు. ‘‘నాకు తాగే అలవాటు లేదు. కాకపోతే ఆ సమయంలో ఓ స్కాచ్‌ బాటిల్‌ తీసుకొని వెళ్లి.. తాగి డెలావర్‌ బ్రిడ్జ్‌ మీద నుంచి దూకాలనుకున్నా. కానీ వెంటనే నా ఇద్దరు కుమారులు గుర్తుకొచ్చారు’’ అని వెల్లడించారు. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య వంటి పిచ్చి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఇంటర్వ్యూలోనే మాజీ అధ్యక్షుడు, తన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో చర్చకు సిద్ధమని బైడెన్‌ తెలిపారు. ఎప్పుడు.. ఎక్కడ అన్న విషయాన్ని ప్రస్తావించలేదు గానీ.. చర్చించడానికి తాను సుముఖంగా ఉన్నానని చెప్పారు. దీనికి ట్రంప్‌ కూడా అంతే వేగంగా స్పందించారు.‘‘ఎక్కడైనా, ఎప్పుడైనా ఓకే’’ అంటూ బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని