జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగం

వరుస క్షిపణి పరీక్షలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఉత్తరకొరియా.. మంగళవారం ఏకంగా జపాన్‌ మీదుగా ఓ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది.

Published : 05 Oct 2022 06:13 IST

ఉత్తరకొరియా దుందుడుకు చర్య

సియోల్‌: వరుస క్షిపణి పరీక్షలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఉత్తరకొరియా.. మంగళవారం ఏకంగా జపాన్‌ మీదుగా ఓ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. అమెరికా అధీనంలోని గువామ్‌ ద్వీపం, పరిసర ప్రాంతాలను అణ్వాయుధాలతో ఈ క్షిపణి తాకగలదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తీవ్ర రెచ్చగొట్టే చర్యగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఉత్తరకొరియా దుందుడుకు చర్యపై జపాన్‌, దక్షిణకొరియా, అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఈ క్షిపణి తమ దేశ ఉత్తర ప్రాంత ద్వీపం హొక్కాయ్‌డో రాజధాని సప్పొరో నగరానికి సమీపంలో పసిఫిక్‌ సముద్రంలో పడినట్లు జపాన్‌ తెలిపింది. ఈ క్రమంలో హొక్కాయ్‌డో, అమోరి ప్రాంతాలకు మంగళవారం ఉదయం రైళ్లను నిలిపివేసింది. 2017 తర్వాత తొలిసారి ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. ఉత్తర కొరియా ప్రయోగించిన ఈ క్షిపణి.. 4,500 నుంచి 4,600 కి.మీ. ప్రయాణించినట్లు దక్షిణ కొరియా, జపాన్‌ అంచనా వేశాయి. ఈ క్షిపణి ప్రయోగంతో జపాన్‌కు నష్టం వాటిల్లిన సమాచారమేదీ వెల్లడి కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని