స్పెయిన్‌లో పార్శిల్‌ బాంబుల కలకలం

స్పెయిన్‌లో పార్శిల్‌ బాంబులు కలకలం రేకెత్తిస్తున్నాయి. మాద్రీద్‌లోని ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయం వద్ద ఇలాంటి ఒక బాంబు పేలి ఒక ఉద్యోగికి గాయాలైన మరుసటి రోజే అమెరికా ఎంబసీ వద్ద మరొకటి గుర్తించారు.

Published : 02 Dec 2022 04:11 IST

అమెరికా ఎంబసీ వద్ద ఒకటి పేల్చివేత

మాద్రీద్‌: స్పెయిన్‌లో పార్శిల్‌ బాంబులు కలకలం రేకెత్తిస్తున్నాయి. మాద్రీద్‌లోని ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయం వద్ద ఇలాంటి ఒక బాంబు పేలి ఒక ఉద్యోగికి గాయాలైన మరుసటి రోజే అమెరికా ఎంబసీ వద్ద మరొకటి గుర్తించారు. నిపుణులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, బాంబును వెంటనే పేల్చేశారు. ఉత్తరాల మాదిరిగా కనిపించే వీటిని ‘లెటర్‌ బాంబు’లుగా పిలుస్తున్నారు. స్పెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖకు, మాద్రీద్‌ వెలుపల వైమానిక స్థావరంలో ఉన్న ఈయూ అంతరిక్ష కేంద్రానికి, ఈశాన్య స్పెయిన్‌లో ఆయుధాల తయారీ కర్మాగారానికి కూడా ఇలాంటివి అందాయి. ఈ కేంద్రంలో తయారయ్యే గ్రెనేడ్లను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తుంటారు. దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల్ని పంపిస్తుండడాన్ని రష్యా ఖండించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని