కరోనా టీకాలకు ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ రూ.5 కోట్ల విరాళం
close

ప్రధానాంశాలు

కరోనా టీకాలకు ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ రూ.5 కోట్ల విరాళం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రజలకు కరోనా టీకాల కార్యక్రమ నిర్వహణ కోసం ప్రసిద్ధ గృహోపకరణాల సంస్థ  ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ సంస్థ రూ.5 కోట్లను విరాళంగా ఇచ్చింది. దీనికి సంబంధించిన లేఖను పీఅండ్‌జీ సంస్థ హైదరాబాద్‌ విభాగాధిపతి సచిన్‌శర్మ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావుకు మంగళవారం ప్రగతిభవన్‌లో అందజేశారు. ఇప్పటికే తాము మాస్క్‌లు, శానిటైజర్లను విరాళంగా ఇస్తున్నామని సచిన్‌శర్మ తెలిపారు. ఈ సురక్ష సర్కిల్స్‌ ద్వారా ప్రభుత్వం, పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రజలకు మరింత సాయం అందిస్తామన్నారు. విరాళం అందించిన పీఅండ్‌జీ సంస్థను కేటీఆర్‌ అభినందించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని