ఊడిపడిన బస్సు చక్రాలు

ప్రధానాంశాలు

ఊడిపడిన బస్సు చక్రాలు

తప్పిన పెను ప్రమాదం

మోటకొండూరు, మునగాల గ్రామీణం, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో బుధవారం రెండు వేర్వేరు సంఘటనల్లో ఓ ఆర్టీసీ బస్సు, మరో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురయ్యాయి. ఓ బస్సుకు వెనక చక్రాలు ఊడిపోగా.. మరోటి అదుపు తప్పి బోల్తాపడింది. రెండు ప్రమాదాల్లోనూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

జగద్గిరిగుట్ట నుంచి తొర్రూరుకు వెళ్తూ..

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డిపోకు చెందిన బస్సు బుధవారం ఉదయం జగద్గిరిగుట్ట నుంచి భువనగిరి మీదుగా తొర్రూరుకు వెళ్తోంది. మధ్యలో కాటెపల్లి సమీపంలోకి రాగానే బస్సు ఎడమవైపు వెనక ఉండే రెండు చక్రాలు ఊడిపోయాయి. ఆ సమయంలో  40 మందికి పైగా ప్రయాణికులు అందులో ఉన్నారు. డ్రైవర్‌ అప్రమత్తమై బ్రేక్‌ వేయడంతో ఆగిపోయింది. ఎవరికీ గాయాలు కాలేదు. టైరు పంక్చర్‌ కావడంతో బస్సు చక్రాలు ఊడిపోయాయని డ్రైవర్‌ తెలిపారు. బస్సు ఫిట్‌నెస్‌ లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.

అదుపుతప్పి ప్రైవేట్‌ బస్సు బోల్తా

ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం శివారులో లారీనీ తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 22 మంది సురక్షితంగా బయటపడ్డారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని