బరువు పెరుగుతున్నారా?
close
Updated : 25/06/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బరువు పెరుగుతున్నారా?

రోజూ నిద్రపోయే ముందు చేసే కొన్ని పొరపాట్ల వల్ల మీకు తెలియకుండానే బరువు పెరిగే ప్రమాదం ఉంది. మరి వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చూద్దామా..
రాత్రి భోజనం ఎక్కువ మొత్తంలో తీసుకోవడం.. ఆ వెంటనే నిద్రపోవడం వల్ల బరువు ఎక్కువవుతుంది.. పొట్ట విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి నిద్రకి కనీసం మూడు గంటల ముందే భోజనాన్ని ముగించాలి.  రాత్రి భోజనంలో పిండిపదార్థాలు తక్కువగా, మాంసకృత్తులు మెండుగా ఉండేలా చూసుకోవాలి.
* ఒత్తిడి, ఆందోళనలు... ఇవి కూడా బరువును పెంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.  నిద్రపోయే ముందు ఎక్కువగా ఒత్తిడికి గురైతే ఆ ప్రభావం మెదడుపై పడుతుంది. దాంతో అది అలసిపోయి నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడతారు. ఇలాంటి చాలా సందర్భాల్లో బరువు పెరుగుతుంటారు. నిద్రలేమి కూడా బరువు పెరగడానికి ఓ కారణమని నిపుణుల అభిప్రాయం.
*ఆలస్యంగా నిద్రపోవడం... పెరిగిన పని వేళలు, అదేపనిగా మొబైల్‌, ల్యాప్‌టాప్‌ చూడటం వల్ల కూడా నిద్రాభంగం అవుతుంది. కళ్లకు విశ్రాంతి ఉండదు. దాంతో నిద్రపట్టదు. ఇది క్రమేపీ బరువు పెరుగుదలకు కూడా కారణమవుతుంది.
* తిన్న తర్వాత శారీరక శ్రమ చేయకుండా ఒకేచోట కూర్చొన్నా బరువు, పొట్ట పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. కాబట్టి తిన్న తర్వాత నాలుగడుగులైనా వేయాల్సిందే.


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని