ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!
close
Updated : 19/07/2021 04:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

* ఫుడ్‌ వ్లోగర్‌గా స్థిరపడాలని ముందే అనుకున్నారా?
ఆశ్రిత: మనం చేసే ప్రతీ పనిలో సంతోషం వెతుక్కుంటాం. అలా ఆహారం, ప్రయాణాలపై ఉన్న అభిరుచితో వేసిన అడుగులే... నాకో కొత్త కెరియర్‌ని పరిచయం చేశాయి. నిజానికి ఈ రంగంలోకి వస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. అనుకోనివి జరగడమే జీవిత చమత్కారమేమో కదా!

* మీకు వంటలు - ప్రయాణాలపై ఆసక్తి ఎలా పెరిగింది?
ఆశ్రిత: నా మధుర జ్ఞాపకాల్లో కుటుంబం, స్నేహితులతో కలిసి డైనింగ్‌ టేబుల్‌ మీద గడిపినవే ఎక్కువ. బహుశా వీటిపై ఇష్టం పెరగడానికి మా ఇంటి వాతావరణమూ ఓ కారణమేమో! నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు నాన్న దగ్గుబాటి వెంకటేశ్‌, పెద్దనాన్న సురేష్‌బాబు ఆఫ్రికా, యూరోప్‌ లాంటి ఖండాలకు షూటింగ్‌ల నిమిత్తం వెళ్లేవారు. తిరిగి వచ్చాక అక్కడి రుచులు, విశేషాలను మాకు చెప్పేవారు. అప్పుడే కొత్త ప్రాంతాలు చూడాలనీ, వింతలూ విశేషాలు తెలుసుకోవాలనీ, ఆయా ప్రాంతాల వంటకాల రుచిని ఆస్వాదించాలనే ఆలోచన వచ్చింది.

* మిమ్మల్ని మెప్పించి...స్ఫూర్తినిచ్చిన వంటకం ఏదైనా ఉందా?
ఆశ్రిత: మా జేజమ్మ (తాతమ్మ), అమ్మమ్మ చాలా బాగా వంట చేస్తారు. నాన్న భోజన ప్రియులు. ఆయన ఖీమా, నెయ్యి, వేడి వేడి అన్నం కలిపి మొదటి ముద్దను తన చేతులతో మాకు తినిపించే వారు. ఆయన అమెరికాలో చదువుకున్న రోజుల్లో స్వయంగా వండుకునేవారట. నేనూ అలాగే చేయాలనుకున్నాను. అలా నన్ను ఆకర్షించిన మొదటి వంట ఖీమా. ఈ రోజుకీ కూడా ఎప్పుడైనా నాకు ఇల్లు కానీ, నాన్న కానీ గుర్తొస్తే చేసేది అదే.

* మొదటిసారి వంట చేసింది ఎప్పుడు?
ఆశ్రిత: మాస్టర్స్‌ చేయడానికి యూకే వెళ్లా. అప్పటికి నాకు వంట పెద్దగా రాదు. ఒంటరిగా ఉండేదాన్ని. మొదటి రెండు నెలలు బయటే తిన్నా. అది ఆరోగ్యానికి సరి పడలేదు. దాంతో చిన్న చిన్నగా వంటలు చేయడం మొదలుపెట్టా. కొన్ని నెలలు గడిచేసరికి స్నేహితులంతా నా వంట తినడానికి ఆసక్తి చూపించడం ఉత్సాహాన్నిచ్చింది. అప్పుడే నాకూ వంటచేసి ఇతరులకు తినిపించడంలో ఉన్న ఆనందం తెలిసింది.

* బ్లాగింగ్‌ చేయడం ఎప్పుడు ఎలా మొదలుపెట్టారు?
ఆశ్రిత: ఇంట్లో వండినా.. పర్యటనల్లో రుచి చూసినా... ఆ పదార్థాలను ఫొటోలు తీసుకోవడం అలవాటుగా మారింది. వాటిని అందరితో పంచుకోవాలని బ్లాగ్‌ రాయాలనుకున్నా. అందుకు ఇన్‌స్టాగ్రామ్‌ చక్కని వేదిక అనిపించింది. అలా ఐదేళ్లక్రితం పుట్టింది ఇన్ఫినిటీ ప్లాటర్‌. తర్వాత యూట్యూబ్‌లోనూ ఛానెల్‌ ఏర్పాటు చేశా. ఇన్‌స్టాలో లక్షా యాభై తొమ్మిది వేల మంది, యూట్యూబ్‌లో 81 వేలమంది ఫాలో అవుతున్నారు.

* మీకు నచ్చే బ్లాగర్‌ ఎవరు?
ఆశ్రిత: వంటల ఈ విషయంలో ‘నైజెల్లా లాసన్‌’ వీడియోలు స్ఫూర్తినిస్తుంటాయి. కొత్త ఆలోచనలకోసం ఆవిడ కార్యక్రమాలు తరచూ చూస్తుంటా. తను తయారు చేసిన పదార్థాలన్నీ నేనూ ప్రయత్నించా.

* బ్లాగర్‌గా మీకు గుర్తింపు వచ్చాకే... మీరెవరో తెలిసింది ఎందుకిలా?
ఆశ్రిత: ఇన్‌స్టాగ్రాంలో ఇన్ఫినిటీ ప్లాటర్‌ మొదలు పెట్టినప్పుడు నేనెవరో ఎవరికీ తెలియదు. మొదటి 3-4 సంవత్సరాలు ‘ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌’ మీద ఆసక్తి ఉన్నవారు మాత్రమే నా పేజ్‌ ఫాలో అయ్యేవాళ్లు. ఏడాదిగా నన్ను గుర్తు పట్టడం మొదలుపెట్టారు. చిన్నప్పటి నుంచీ మమ్మల్ని మేం పరిచయం చేసుకునేటప్పుడు ఫ్యామిలీ పేరుని, వారికున్న ప్రతిష్టనీ ప్రస్తావించకూడదు అని నేర్పారు. నాకు ఇప్పటికీ మా కుటుంబం పేరు వాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబ నేపథ్యం వల్లే నాకన్నీ చాలా సులభంగా వచ్చాయని జనం ఊహించుకుంటారు. అందుకే... నాది స్వయంకృషి అని నిరూపించడానికే నా కలల్ని నా అంతట నేనే నెరువేర్చుకోవడం మొదలు పెట్టాను. ఇప్పుడు నాన్న, అన్నయ్య, వదిన వాళ్ల సోషల్‌ మీడియా పేజీల్లో నన్ను ట్యాగ్‌ చేస్తున్నారు. కానీ మొదట నాకు నేనుగానే గుర్తింపు తెచ్చుకున్నా.

* వీడియోలు, ఫొటోల ఎడిటింగ్‌ ఎలా?
ఆశ్రిత: జీవితంలో ఏ కెరీర్‌ ఎంచుకున్నా నేర్చుకుంటూ ఉండాలి. కాబట్టి నేనూ నేర్చుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ అడుగులేస్తున్నాను. నేను చేసే వంటని సింపుల్‌గా, సహజ వర్ణాలతో, తక్కువ ప్రోప్స్‌తో షూట్‌ చేస్తాను. నాకు ఫొటోలను ఎడిట్‌ చెయ్యడం నచ్చదు. అలా చేస్తే సహజంగా అనిపించవు. ఈ బ్లాగ్‌, వ్లోగ్‌ల ద్వారా కొత్త రుచులను పరిచయం చేయడమే కాదు... పరిశోధన, సంస్కృతి, ఆహార నియమాలు, మనిషి ప్రవర్తన పరిశీలించడం వంటివెన్నో తెలుసుకోవచ్చు.

* పెద్ద కుటుంబం నుంచి వచ్చారు? ఇంత కష్టం నాకెందుకు అని ఎప్పుడూ అనిపించలేదా?
ఆశ్రిత: నేనెప్పుడూ అలా అనుకోలేదు. చాలామంది అదే అంటారు. బాగా స్థిరపడ్డ కుటుంబం... నీకెందుకింత కష్టం అంటుంటారు. ఎవరి జీవిత లక్ష్యం వారు తెలుసుకుని, నచ్చిన పని చేసుకుంటూ వెళ్లడంలోనే ఆత్మసంతృప్తి ఉంటుంది. కష్టపడకుండా ఏదీ తేలిగ్గా దొరకదు అనేది నా ప్రగాఢ విశ్వాసం.

* మీ ఆలోచనలకు ఇంట్లో వాళ్ల స్పందన, ప్రోత్సాహం ఎలా ఉన్నాయి?
ఆశ్రిత: నేను బ్లాగ్‌ రాయాలనుకుంటున్నా అన్నప్పుడు ఇంట్లో అందరూ ఎంతో ప్రోత్సహించారు. నాన్న ఎన్నో ఐడియాలు ఇచ్చేవారు. ఫొటోగ్రఫీ మెలకువలు నేర్పేవారు. అమ్మ నీరజ మంచి విమర్శకురాలు. ఇప్పటికీ చక్కటి ఫీడ్‌ బ్యాక్‌ ఇస్తుంది. పెదనాన్న ఇచ్చే స్మార్ట్‌ బిజినెస్‌ టిప్స్‌ నాకెంతో ఉపయోగపడతాయి. ఇక మా వారు వినాయక్‌ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వీరందరి ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోంది. నాన్న తక్కువ మాట్లాడినా... ఎక్కువ అర్థం చేసుకోగలరు. నా నడకను చూసి కూడా ఏ మూడ్‌లో ఉన్నానో చెప్పేస్తారు. ‘నువ్వు చేస్తున్న పనిని చూసి గర్విస్తున్నా’ అని ఆయన చెప్పినప్పుడు ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను.

* ప్రయాణాలంటే కూడా ఇష్టమన్నారు? మీకు బాగా నచ్చే ప్రదేశం ఏది?
ఆశ్రిత: ఇప్పటి దాకా 20 దేశాలు చూసేశాను. అన్నిటి కంటే నాకు ఇష్టమైనది కర్ణాటకలోని కూర్గ్‌. దాంతో నాకు ఎనలేని అనుబంధం ఉంది. మాల్దీవుల్లో స్కూబా డైవింగ్‌, ముప్పైవ పుట్టిన రోజున స్కై డైవింగ్‌ చేశాను. నేను పొందిన అద్భుతమైన అనుభూతుల్లో అవి కూడా ఉన్నాయి.

* మన దేశానికి చాలా దూరంలో ఉంటున్నారు?
ఆశ్రిత: యూకేలో చదివేటప్పుడు యూరోప్‌ అంతా తిరిగా. అప్పుడే ఇక్కడ స్థిరపడాలని నిర్ణయించుకున్నా. పెళ్లయ్యాక నేనూ మావారు స్పెయిన్‌లోని బార్సిలోనాలో స్థిరపడ్డాం.

* ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు...
ఆశ్రిత: ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌, ఆపై ఎంబీఏ చేశా. ఫుడ్‌ - ట్రావెల్‌ - ఫొటోగ్రఫీ రంగాలపై ఆసక్తే నన్ను ఇన్ఫినిటీ ప్లాటర్‌ వైపు నడిపించింది. ఇప్పటికైతే ఇదే నా ప్రధాన కెరియర్‌. ఇందుకోసమే బార్సిలోనాలో కల్నరీ షెఫ్‌ ప్రోగ్రాం చేస్తున్నాను.. అది నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుందో చూడాలి.


మంచిమాట

బలహీనతలను దాచుకోవద్దు.. వాటిని అధిగమించండి.

- పరిణీతి చోప్రా, బాలీవుడ్‌ నటి


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని