Prudhviraj: జగన్‌ది తుగ్లక్‌ పాలన.. చంద్రబాబుది సుపరిపాలన: పృథ్వీరాజ్‌

జగన్‌ ప్రభుత్వం తుగ్లక్‌ పాలనకు నిదర్శనమని సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్‌ (Prudhviraj) విమర్శించారు.

Published : 30 Apr 2024 16:57 IST

జగన్‌ ప్రభుత్వం తుగ్లక్‌ పాలనకు నిదర్శనమని సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్‌ (Prudhviraj) విమర్శించారు. విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి భరత్‌ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌తో వైకాపా ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు.

Tags :

మరిన్ని