Shankar Narayana: నోటి దగ్గరి కూడు లాక్కుంటావా?.. వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ

శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని ఈదలబలాపురం గ్రామపంచాయతీ పరిధిలోని రేణుక నగర్‌లో గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించేందుకు వెళ్లిన మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే శంకరనారాయణ (Shankar narayana)కు నిరసనసెగ తగిలింది. రేణుక నగర్‌లో ఐదు నెలలపాటు రేషన్ బియ్యం ఇవ్వకుండా చేశారని, రోడ్లు, డ్రైనేజీలు నిర్మించకుండా అభివృద్ధికి అడ్డంకిగా మారారంటూ మాజీ మంత్రి శంకరనారాయణ తమ గ్రామంలోకి రాకుండా ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకున్నా.. గ్రామస్థులు పట్టు విడువకపోవడంతో శంకరా నారాయణ అక్కడి నుంచి వెనుదిరిగారు. 

Updated : 01 May 2023 11:35 IST

Tags :

మరిన్ని