AP News: కూటమి మ్యానిఫెస్టోపై హర్షాతిరేకాలు.. వైకాపాపై పెదవివిరుపులు

తెలుగుదేశం, జనసేన మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 02 May 2024 15:08 IST

తెలుగుదేశం, జనసేన మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని గాడిన పెట్టేలా అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యమిస్తూ తెలుగుదేశం-జనసేన విడుదల చేసిన మ్యానిఫెస్టోకి విశేష స్పందన లభిస్తోంది. ఈ మ్యానిఫెస్టో ఎన్డీయే నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపగా వైకాపా మ్యానిఫెస్టోపై ఆ పార్టీ వాళ్లే పెదవివిరుస్తున్నారు. రెండు మ్యానిఫెస్టోలనూ పోలిస్తే వైకాపాది తేలిపోయిందన్న భావన వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది

Tags :

మరిన్ని