రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తులు, ప్రత్యేక పూజలతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.

Published : 23 Apr 2024 15:08 IST

హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తెల్లవారుజాము నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొక్కులు చెల్లించుకుంటూ భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకుంటున్నారు. కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తజనం పోటెత్తింది. రద్దీ దృష్ట్యా ఆలయాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Tags :

మరిన్ని