విజయనగరాన్ని అభివృద్ధి చేయకుండా.. ఓట్లు అడగటానికి మళ్లీ ఎలా వస్తున్నారు?

తెల్లారిలేస్తే 99% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం తమదేనని సీఎం జగన్‌ డబ్బా కొట్టుకుంటారు.

Published : 23 Apr 2024 12:47 IST

తెల్లారిలేస్తే 99% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం తమదేనని సీఎం జగన్‌ డబ్బా కొట్టుకుంటారు. అయిదేళ్లలో మీ కుటుంబానికి మేలు జరిగిందనుకుంటేనే మీ బిడ్డకు మద్దతివ్వండని ముఖంలో అమాయకత్వం ప్రదర్శిస్తూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలకు పాదయాత్రలో హామీలు కురిపించిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయలేదు. గత తెదేపా ప్రభుత్వంలో చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేసి హడావుడి చేశారు తప్ప పనుల్లో ముందడుగు లేదు. కీలకమైన తోటపల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పనులు చేస్తామని చెప్పి గత తెదేపా హయాంలో మంజూరు చేసిన పనులే నిలిపేశారు.

Tags :

మరిన్ని