Kartika Mahotsavam: ఇంటినుంచే కార్తికమాస పూజల్లో పాల్గొనేలా.. ‘కార్తిక మహోత్సవం’

‘‘న కార్తిక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్’’ అంటే కార్తిక మాసంతో సమానమైన మాసం, విష్ణువుతో సమానమైన దైవం, గంగతో సమానమైన నది లేదని స్కాంధపురాణం చెబుతోంది. ఈ మాసంలో ప్రతిరోజూ పుణ్యదినమే. తెలుగు ప్రేక్షకులు ఇంటినుంచే కార్తికమాస పూజల్లో పాల్గొనేలా ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌/ఈటీవీ తెలంగాణ “కార్తిక మహోత్సవం" నిర్వహిస్తోంది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23 వరకు సా.6.15 – 7.00 గం. వరకు ప్రసారం అవుతుంది. 27 నక్షత్రాల్లోని 4 పాదాలు మొత్తం 108 పాదాల్లోనే మానవ జననం. భగవంతుడి 108 నామాల అష్టోత్తర పారాయణంతో జాతక దోషాలను తొలగించేందుకు రోజుకో దేవీదేవతల అష్టోత్తర పారాయణం ఉంటుంది. వీక్షకులు తమ గోత్రనామాలు చదువుకుంటూ దీనిలో పాల్గొనవచ్చు. కార్తిక పురాణ ప్రవచనం, పురాణాంతర్గత సందేహాలపై "ధర్మం-మర్మం" కార్యక్రమంలో ప్రత్యేకతలు. తెలుగురాష్ట్రాల్లో సుప్రసిద్ధ ప్రవచనకర్తలు పాల్గొంటారు. 2వ తేదీ, బుధవారం నందీశ్వర అష్టోత్తరాన్ని ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త డా.పుల్లాభట్ల వెంకటేశ్వర్లు పారాయణం చేయిస్తారు.

Updated : 02 Nov 2022 12:46 IST

Tags :

మరిన్ని