Chennai X Kolkata: ధోనీ-గంభీర్‌ స్పెషల్‌ హగ్‌.. వీడియో వైరల్‌

ఐపీఎల్‌ (IPL 2024)లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ఊపుమీదున్న కోల్‌కతాను 7 వికెట్ల తేడాతో చెన్నై చిత్తుచేసింది. మ్యాచ్‌ అనంతరం ధోనీ (MS Dhoni), కోల్‌కతా మెంటర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 2011 వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరూ సూపర్‌ హీరోలే. ఆ మ్యాచ్‌లో గంభీర్‌ 97 పరుగులు చేయగా.. ధోనీ 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమ్‌ఇండియాకు ప్రపంచకప్‌ను అందించాడు. సోమవారం మ్యాచ్‌లో వీరిద్దరి ఆత్మీయ సంభాషణను గమనించిన ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ మ్యాచ్‌కే ప్రత్యేకమైన దృశ్యంగా అభివర్ణించింది.

Updated : 09 Apr 2024 16:42 IST

Tags :

మరిన్ని