Rajasthan vs Bengaluru: బెంగళూరును ఓడించిన రాజస్థాన్‌.. గెలుపు సంబరాలు చూశారా?

బెంగళూరుతో జరిగిన ఎలిమిటనేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Updated : 23 May 2024 01:48 IST

బెంగళూరుతో జరిగిన ఎలిమిటనేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్‌ (45) టాప్‌ స్కోరర్‌. రియాన్‌ పరాగ్‌ (36), హెట్‌మయర్‌ (26) రాణించారు. చివరి రెండు ఓవర్లలో 13 పరుగులు చేయాల్సి ఉండగా, రోమన్‌ పావెల్‌ (16*) రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టి రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో రాజస్థాన్‌ శిబిరంలో ఆనందాలు వెల్లివిరిశాయి. ఓటమితో బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించగా, రాజస్థాన్‌ ఫైనల్‌ బెర్తు కోసం హైదరాబాద్‌తో రెండో క్వాలిఫయర్‌లో తలపడనుంది. 

Tags :

మరిన్ని