Sanju Samson: సంజు ఔట్‌ వివాదాస్పదం.. ఆ క్యాచ్‌ చూశారా?

మంగళవారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఔట్‌ తీవ్ర వివాదాస్పదం అయింది.

Published : 08 May 2024 10:30 IST

ఐపీఎల్‌ 2024లో భాగంగా మంగళవారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఔట్‌ తీవ్ర వివాదాస్పదం అయింది. ముకేశ్‌ కుమార్‌ వేసిన 16వ ఓవర్లో సంజు షార్ట్‌ పిచ్‌ బంతిని లాంగాన్‌ వైపు సిక్సర్‌ బాదేందుకు ప్రయత్నించాడు. బౌండరీ లైన్‌ వద్ద హోప్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే క్యాచ్‌ పట్టాక అతడి ఎడమ పాదం బౌండరీ హద్దును దాదాపుగా తాకినట్లే రీప్లేలో కనిపించింది. షూకి, బౌండరీ హద్దుకు మధ్య ఖాళీ కనిపించలేదు. కానీ రీప్లే పరిశీలించాక మూడో అంపైర్‌ ఔటిచ్చాడు. బంతి బౌండరీ లైన్‌ తాకిందనడానికి స్పష్టమైన ఆధారం కనిపించలేదు. సంతృప్తి చెందని శాంసన్‌ అంపైర్‌తో వాదించినా ఫలితం లేకపోయింది.

Tags :

మరిన్ని