Bhadradri: దర్గాలో ఘనంగా శ్రీరాముడి పట్టాభిషేకం

భద్రాద్రి జిల్లా ఇల్లెందులోని దర్గాలో శ్రీరాముడి పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. పట్టాభిషేకాన్ని తిలకించేందుకు హిందువులతో సహా మహమ్మదీయులు సైతం భారీగా తరలివచ్చారు. 

Updated : 18 Apr 2024 17:57 IST

భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణ సత్యనారాయణపురం సమీపంలోని హజరత్‌ నాగుల్‌ మీరా దర్గాలో అర్చకుల వేదమంత్రాల నడుమ గురువారం శ్రీరామపట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. మతసామరస్యాన్ని పెంపొందించేలా ఈ దర్గాలో శ్రీరామనవమి వేడుకలు, శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. పట్టాభిషేకాన్ని తిలకించేందుకు హిందువులు సహా మహమ్మదీయులు సైతం భారీగా తరలివచ్చారు. 

Tags :

మరిన్ని