Nitish Reddy: మాట నిలబెట్టుకున్న నితీశ్‌ రెడ్డి.. నెట్టింట వీడియో వైరల్‌

మంగళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ విజయంలో తెలుగు కుర్రాడు నితీశ్‌రెడ్డి కీలకపాత్ర పోషించాడు. ఒత్తిడిలోనూ ఏమాత్రం తొణక్కుండా అదిరే ఇన్నింగ్స్‌ (64; 37 బంతుల్లో 4×4, 5×6)తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను నిలబెట్టాడీ 20 ఏళ్ల ఆంధ్ర ఆల్‌రౌండర్‌. అయితే మ్యాచ్‌కు అతడు మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘గతేడాది బౌలింగ్‌తో ఆకట్టుకున్నా. ఈ సీజన్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అలరిస్తా’ అని అతడు ముందే చెప్పాడు. చెప్పినట్టుగానే ఈ సీజన్‌లో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ నితీశ్‌ అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటాడు. దీంతో నితీశ్‌ మాట నిలబెట్టకున్నాడని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated : 10 Apr 2024 16:48 IST

Tags :

మరిన్ని