Ayodhya Ram Mandir: అయోధ్యలో అద్భుత దృశ్యం.. బాలరాముడి నుదిటిపై పడిన సూర్యకిరణాలు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయం (Ayodhya Ram Mandir)లో ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై కన్పించిన ‘సూర్య తిలకం (Surya Tilak)’తో భక్తజనం పరవశించిపోయింది. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి.

Published : 17 Apr 2024 14:59 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు