Tirumala: తిరుమలలో ఉగాది వేడుకలు.. ముస్తాబైన శ్రీవారి సన్నిధి

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీక్రోధినామ సంవత్సర ఉగాదిని వైభవంగా నిర్వహించడానికి తితిదే ఏర్పాట్లు చేసింది. ఉగాది నుంచే తిరుమలేశుని ఆలయ కార్యక్రమాలు, ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఉగాది ఆస్థానం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బంగారు వాకిలి ఎదుట గరుడాళ్వారుకు అభిముఖంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని కొలువుదీర్చనున్నారు. సాయంత్రం మాడవీధుల్లో ఉభయ దేవేరులతో శ్రీమలయప్పస్వామి బంగారు పల్లకిపై భక్తకోటిని అనుగ్రహించనున్నారు.

Updated : 09 Apr 2024 12:31 IST

Tags :

మరిన్ని