Rajasthan vs Bengaluru: అశ్విన్‌ బౌలింగ్‌ మ్యాజిక్‌.. వరుస బంతుల్లో గ్రీన్‌, మాక్స్‌వెల్‌ ఔట్‌

బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ 4 వికెట్ల తేడాతో గెలిచింది. రాజస్థాన్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన బౌలింగ్‌తో మాయ చేశాడు. కీలక తరుణంలో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి బెంగళూరు భారీ స్కోర్‌ చేయకుండా నిలువరించాడు. 

Published : 23 May 2024 09:46 IST

బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ 4 వికెట్ల తేడాతో గెలిచింది. రాజస్థాన్‌ బౌలర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ కీలక సమయంలో తన బౌలింగ్‌తో మ్యాజిక్‌ చేశాడు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన అశ్విన్‌ వరుస బంతుల్లో కామెరూన్‌ గ్రీన్‌, మాక్స్‌వెల్‌ను ఔట్‌ చేసి బెంగళూరును దెబ్బదీశాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 4 ఓవర్లు వేసిన అశ్విన్‌ 19 పరుగులే ఇవ్వడంతో పాటు 2 వికెట్లు తీయడంతో ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపిక చేశారు.   

Tags :

మరిన్ని