Bengaluru vs Kolkata: మూమెంట్‌ ఆఫ్ ది మ్యాచ్‌.. కోహ్లీకి గంభీర్‌ హగ్‌

ఐపీఎల్‌ - 2024లో బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉప్పు, నిప్పులా ఉండే విరాట్‌ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌లు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, పలకరించుకున్నారు. కోల్‌కతా ఫీల్డింగ్‌ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలో ఇది జరిగింది. కోహ్లీ వద్దకు గంభీర్ వచ్చి హగ్‌ చేసుకున్నాడు. గతేడాది వీరి మధ్య జరిగిన వాగ్వాదం ఒక్కసారిగా అభిమానులను షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. కోహ్లీ బెంగళూరు తరఫున ఆడుతుండగా.. గంభీర్‌ కోల్‌కతా టీమ్‌కు మెంటార్‌గా ఉన్నాడు.

Updated : 30 Mar 2024 08:30 IST

Tags :

మరిన్ని