Viral Video: పరిమళించిన మానవత్వం 
close

Published : 14/07/2021 23:42 IST
Viral Video: పరిమళించిన మానవత్వం 

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనిషిగా పుట్టిన తర్వాత మానవత్వంతో మెలగాలి. విభిన్న ప్రతిభావంతుల పట్ల దయ, సానుభూతి చూపించాలి. వాళ్లకు చేతనైనంత సాయం చేయాలి. వారిపట్ల మానవత్వంతో మెలగడం వల్ల సమాజంలో గౌరవం దక్కుతుంది. అందుకు నిదర్శనమే ఈ వీడియో. ఒంటి కాలుతో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న ఓ అమ్మాయిని ఒక మహిళ వీపుమీద ఎక్కించుకుని రోడ్డు దాటించింది. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ వీడియోను సుప్రియా సాహు అనే ఐఏఎస్‌ అధికారిణి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు.  


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని