Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
నీటిమూటే
రాష్ట్రంలో అడుగడుగునా ముక్కు పిండుడే
ఉచిత నీరంటేనే.. మొసలి కన్నీరు!
కేంద్రం సూచించినా అంతే
అబ్బే భారమంటూ సాకులు
అవకాశమున్నా పట్టించుకోని పాలకులు
నిర్లక్ష్యమే అసలు సమస్య
ఇదీ రాష్ట్ర సర్కారు తీరు
ఈనాడు - హైదరాబాద్‌
ప్రజలకు తాగునీటిని ఉచితంగా ఇద్దామని ఢిల్లీ సర్కారు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం మన రాష్ట్రంలో అమలు సాధ్యం కాదా? ప్రాణకోటికి మౌలికమైన జీవనధార తాగునీటిని సరఫరా చేసే ఆర్థిక స్థోమత మన ప్రభుత్వానికి లేదా? ‘ఆప్‌’ సర్కారు ఢిల్లీ ప్రజలకు ఉచిత తాగునీటి పథకం అమలు చేసిన తరువాత మన రాష్ట్రంలోని సగటు జీవిలోనూ తలెత్తిన ఆలోచనలివి! కనీస జీవనధార కేటగిరీ కింద నెలకు 20 వేల లీటర్ల వరకు తాగునీటిని వినియోగించే వినియోగదారులు ఒక్కరూపాయి కూడా చెల్లించనక్కర్లేదని కేజ్రీవాల్‌ ప్రభుత్వం తేల్చిచెప్పింది. కానీ మన రాష్ట్రంలో ఉచిత మంచినీరనే మాట కనటానికి కాదు వినటానికే సుదూరంగా ఉంది. పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజలకు జీవనధార కింద కనీస పరిమాణంలో తాగునీటిని ఉచితంగా సరఫరా చేయాలని, వారి నుంచి వసూలు చేసే ఛార్జీల్లోనూ 50 శాతం రాయితీ ఇవ్వాలంటూ కేంద్రం చేసిన సూచననూ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. కనీసం అమలు చేసేందుకు అధ్యయనం కూడా చేయలేదు. పైగా పబ్లిక్‌ నల్లాలను తొలగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో పేదలు, ధనికులు, నిరాశ్రయులు, మురికివాడల ప్రజలనే తారతమ్యాలు లేకుండా గుక్కెడు తాగునీటిని ప్రతి ఒక్కరు కొనుక్కోవాల్సిన దుస్థితి మన రాష్ట్రంలో నెలకొంది.

భారం తక్కువే....
ఉచిత తాగునీటిని అందించాలని అన్నప్పుడల్లా.. అమ్మో.. జలమండలి, మున్సిపాలిటీలపై భారీ భారం పడుతుందని ప్రభుత్వం ప్రతిసారీ మొసలి కన్నీరు కారుస్తుంటుంది! కానీ ఆ మాటలన్నీ అవాస్తవాలే అంటున్నారు నిపుణులు! రాష్ట్రంలో పట్టణాల్లో నివసించే పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉచిత తాగునీటిని అందిస్తే నెలకు రూ.30 కోట్ల భారం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. జలమండలి పరిధిలో నెలకు 15వేల లీటర్ల వరకు తాగునీటిని వినియోగించే వినియోగదారుల (మురికివాడలు, సాధారణ కాలనీలు) ఛార్జీలు రూ.20 కోట్లు, జీవీఎంసీ, విజయవాడ, తిరుపతితో పాటు మిగతా మున్సిపాలిటీలు, పట్టణాల్లో (మిగతా 2లో)

ఈ భారం మరో రూ.10 కోట్ల వరకు ఉంటుంది. జీహెచ్‌ఎంసీ మినహా మిగతా నగరాలు, మున్సిపాలిటీల్లో గృహ అవసరాల కేటగిరీ కింద ప్రతి ఏడాది రూ.153 కోట్ల డిమాండ్‌ ఉంటోంది. జీవీఎంసీలో డిమాండ్‌ నెలకు కోటిన్నర మాత్రమే. ఆయా మున్సిపాలిటీల్లో వృథాను అరికడితే ఉచితంగా సరఫరాకు అవకాశం ఉంటుంది. అవసరమైతే ఈ మొత్తాన్ని ప్రభుత్వం గ్రాంటు కింద భరిస్తే ఉచితం సాధ్యమేనని అధికారులు పేర్కొంటున్నారు. ఢిల్లీలో మీటర్లు ఉన్న కనెక్షన్లకు మాత్రమే ఉచితమని ఢిల్లీ జల బోర్డు తెలిపింది. అక్కడ 20 లక్షల కనెక్షన్లలో 9 లక్షల కనెక్షన్లకు మీటర్లు ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో మీటర్లున్న కనెక్షన్లు చాలా తక్కువ. జల మండలి పరిధిలో దాదాపు 7.5 లక్షల కనెక్షన్లు ఉంటే.. మీటర్లు లక్ష మాత్రమే. మిగతా మున్సిపాలిటీల్లో ఇంకా వీటి ఏర్పాటు జరగలేదు.

అధికారుల నిర్లక్ష్యంతో పెరుగుతున్న వృథా...
నష్టాల పేరిట జలమండలి 2011 డిసెంబరులో తాగునీటి ఛార్జీలను భారీగా పెంచింది. కానీ వృథాను అరికట్టడంలో విఫలమైంది. ఉదాహరణకు జలమండలి పరిధిలో ప్రతిరోజూ 340 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో దాదాపు సగం (49శాతం) 167 ఎంజీడీల తాగునీరు వృథాగా పోతోంది. ఈ నీటికి సంబంధించి లెక్కలు లేవు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు తాగునీటి సరఫరాలో 10-15 శాతం వృథా ఉంటుంది. కానీ జలమండలి పరిధిలో సగభాగం వృథా అవుతుండటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా చెప్పవచ్చు. 2008లోనే జలమండలి పరిధిలో తాగునీటి వృథాను అరికట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినా లాభం లేకపోయింది. అప్పట్లో 39 శాతం ఉన్న వృథా... తాజాగా 49 శాతానికి చేరడమే నిదర్శనం. ఈ వృథా ఖరీదును ప్రాజెక్టుల వారీగా లెక్కిస్తే రూ.2వేల కోట్లు అవుతోంది. వృథాను అరికట్టి తాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించకుండా కొత్త నీటి వనరులను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం వృథాగా పోతున్న 167 ఎంజీడీల నీరు కృష్ణా-1, 2 దశల కింద తీసుకువస్తున్న నీటితో సమానం. 2013 నాటికి వృథా నీటిలో 40 శాతం తగ్గించాలన్న ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదు. జలమండలి పరిధిలో నెలకు రూ.51 కోట్ల బిల్లులు వసూలు అవుతున్నాయి. వృథా నీటిని అరికడితే ఆదాయం పెరగడంతో పాటు నష్టాల నుంచి బయటపడొచ్చు. నెలకు కనీసం మరో రూ.50 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందించేందుకు వీలవుతుంది.
కేంద్రం ఏమి చెప్పింది?
* మీటరు రీడింగ్‌ ప్రకారం రోజుకి 20 లీటర్ల చొప్పున నెలకు 3000 లీటర్ల లోపు తాగునీరు వినియోగించే వారికి ఉచితంగా సరఫరా చేయాలి. వారి నుంచి బిల్లుల జారీ, వసూలు కోసం రూ.30 మేరకు మాత్రమే తీసుకోవాలి.
* రోజుకి 100 లీటర్ల చొప్పున నెలకు 15,000 లీటర్ల వరకు వినియోగించే అల్పాదాయ వర్గాలు ద్వితీయ కేటగిరీలోకి వస్తారు. ప్రతి 1000 లీటర్లకు రూ.7 చోప్పున వసూలు చేయాలి. మొత్తం బిల్లులో 50 శాతం రాయితీ ఇవ్వాలి.
* మీటర్లు లేని కనెక్షన్లకు నెలకు రూ.60 నుంచి 100 చొప్పున సాధారణ బిల్లు వసూలుచేయాలి.
* ఇంటిలో కుళాయిల సంఖ్య మేరకు బిల్లులు నిర్ణయించాలి. 3లోపు కుళాయిలు ఉంటే రూ.80, 4-7 ఉంటే రూ.130, 8-12 ఉంటే రూ.225 చొప్పున బిల్లులు ఉండాలి.
* నిర్మిత స్థలం మేరకు ఛార్జీలు నిర్ణయించాలి. 500 చ.అడుగులు ఉంటే రూ.60, 1000 చ.అ లోపు ఉంటే నెలకు రూ.150, 1500 చ.అడుగుల లోపు ఉంటే రూ.250, ఆ పైన విస్తీర్ణం ఉంటే రూ.400 చొప్పున బిల్లులు నిర్ణయించాలి.
మన రాష్ట్రంలో ఏం జరుగుతోంది
* రాష్ట్రంలో జీవనధార కేటగిరీ లేదు. ఇంటింటికీ తాగునీటి కనెక్షన్‌ పేరిట ప్రతి గృహాన్నీ ఛార్జీల పరిధిలోకి తీసుకు వస్తున్నారు.
* పేదలకు తాగునీరు ఇవ్వాల్సిన కనీస ధర్మం నుంచి పురపాలక శాఖ తప్పించుకుంది. ఆదాయం రాని తాగునీటి కేటగిరీ కింద పట్టణాలు, నగరాల్లోని పబ్లిక్‌ నల్లాలను తొలగించారు.
* అల్పాదాయ వర్గాలకు తాగునీటి ఛార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని కేంద్రం సూచించినా, ఆదేశాలు అమలు కావడం లేదు.
* జల మండలి పరిధిలో మురికివాడలను సాధారణ కేటగిరీలోకి సూచిస్తూ ప్రతి 1000 లీటర్లకు రూ.10 చొప్పున బిల్లులు వసూలు చేస్తోంది. కేంద్రం సూచించిన కనీస ఛార్జీ కన్నా రూ.3 ఎక్కువగా ఉంటోంది. మొత్తం తాగునీటి ఛార్జీలో 35 శాతం మురుగునీటి ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

* జలమండలి పరిధిలో కనీస ఛార్జీ రూ.212.50గా ఉంది. ఇక మున్సిపాలిటీలో నెలకు రూ.100 చొప్పున కనీస ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
* ప్రజల నుంచి జలమండలి, మున్సిపాలిటీలకు రూ.970 కోట్ల తాగునీటి బకాయలు వసూలు కావాల్సి ఉంది. అలాగే ప్రభుత్వ భవనాలు, సేవల ఛార్జీలు దాదాపు రూ.214 కోట్లు బకాయలుగా ఉన్నాయి.
అధికారుల నిర్లక్ష్యంతో పెరుగుతున్న వృథా...
నష్టాల పేరిట జలమండలి 2011 డిసెంబరులో తాగునీటి ఛార్జీలను భారీగా పెంచింది. కానీ వృథాను అరికట్టడంలో విఫలమైంది. ఉదాహరణకు జలమండలి పరిధిలో ప్రతిరోజూ 340 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో దాదాపు సగం (49శాతం) 167 ఎంజీడీల తాగునీరు వృథాగా పోతోంది. ఈ నీటికి సంబంధించి లెక్కలు లేవు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు తాగునీటి సరఫరాలో 10-15 శాతం వృథా ఉంటుంది. కానీ జలమండలి పరిధిలో సగభాగం వృథా అవుతుండటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా చెప్పవచ్చు. 2008లోనే జలమండలి పరిధిలో తాగునీటి వృథాను అరికట్టేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినా లాభం లేకపోయింది. అప్పట్లో 39 శాతం ఉన్న వృథా... తాజాగా 49 శాతానికి చేరడమే నిదర్శనం. ఈ వృథా ఖరీదును ప్రాజెక్టుల వారీగా లెక్కిస్తే రూ.2వేల కోట్లు అవుతోంది. వృథాను అరికట్టి తాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించకుండా కొత్త నీటి వనరులను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం వృథాగా పోతున్న 167 ఎంజీడీల నీరు కృష్ణా-1, 2 దశల కింద తీసుకువస్తున్న నీటితో సమానం. 2013 నాటికి వృథా నీటిలో 40 శాతం తగ్గించాలన్న ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదు. జలమండలి పరిధిలో నెలకు రూ.51 కోట్ల బిల్లులు వసూలు అవుతున్నాయి. వృథా నీటిని అరికడితే ఆదాయం పెరగడంతో పాటు నష్టాల నుంచి బయటపడొచ్చు. నెలకు కనీసం మరో రూ.50 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందించేందుకు వీలవుతుంది.

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net