
ప్రధానాంశాలు
హాసన, న్యూస్‌టుడే: తన కుటుంబాన్ని కాపాడుకొనే ప్రయత్నంలో ఓ వ్యక్తి అతిపెద్ద సాహసం చేశాడు. తన వాళ్లని రక్షించుకొనేందుకు చిరుతతోనే తలపడ్డాడు. శక్తినంతా కూడదీసుకొని భీకరపోరు సాగించాడు. చిరుతపులి తీవ్రంగా గాయపరిచినా ప్రాణాలకు తెగించి ఎదురొడ్డాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మృగాన్ని సంహరించాడు. కర్ణాటకలోని హాసన జిల్లా అరసికెరె తాలూకా బైరగొండనహళ్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికుడైన రాజగోపాల్ సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై భార్య, కుమార్తెతో కలిసి బైరగొండనహళ్లి కొండ ప్రాంతంలో వెళ్తుండగా చిరుత అడ్డొచ్చింది. దాన్ని చూసి అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వాహనం నుంచి భార్య, కుమార్తె కిందపడ్డారు. అదే సమయంలో చిరుత వారిపై దాడిచేసింది. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలు కోల్పోవడం ఖాయమని భావించిన రాజగోపాల్..వెంటనే మృగంతో తలపడ్డాడు. చేతికి అందిన కర్రతో చితకబాదాడు. అది కూడా ఎదురుదాడి చేసి.. రాజగోపాల్ తల భాగాన్ని తీవ్రంగా గాయపరిచినా వెనుకంజ వేయలేదు. చివరికి చిరుతను హతమార్చడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే చిరుత సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో ఇద్దరిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిందని గ్రామస్థులు తెలిపారు. కుటుంబం కోసం చిరుతతో పోరాడిన రాజగోపాల్ నిజమైన హీరో అంటూ స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజగోపాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- పాపం ప్రియ.. షారుఖ్ తనయ..
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- పెళ్లిపై స్పందించిన విశాల్
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- రేపు భారత్ బంద్
- పిచ్‌తో కాదు బ్యాటింగ్ వల్లే 2 రోజులు: కోహ్లీ
- స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్
- భారత్‌కే ‘ఫైనల్’ అవకాశం: ఇంగ్లాండ్ ఎలిమినేట్
- ఆక్సిజన్ కొరత..ఆఫ్రికా, లాటిన్ దేశాలు విలవిల!
- రెండు రోజుల సంబరం.. కోహ్లీసేన అంబరం