CSK Vs KKR: రాణించిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌.. చెన్నై లక్ష్యం 172

క్రీడలు

CSK Vs KKR: రాణించిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌.. చెన్నై లక్ష్యం 172

ఇంటర్నెట్‌ డెస్క్‌: అబుదాబి వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి (45; 33 బంతుల్లో బంతుల్లో 4×4, 1×6), నితీశ్ రాణా (37; 27 బంతుల్లో  3×4, 1×6) రాణించారు. సీఎస్కే బౌలర్లలో హేజిల్‌వుడ్‌, శార్దూల్ ఠాకూర్‌ రెండు, జడేజా ఒక వికెట్‌ పడగొట్టారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ (9)ని రాయుడు రనౌట్‌ చేశాడు. తర్వాత వెంకటేశ్‌ అయ్యర్‌ (18)తో కలిసి త్రిపాఠి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. సామ్‌కరన్ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో త్రిపాఠి సిక్స్‌, ఫోర్‌ బాదాడు. హేజిల్‌ వుడ్‌ వేసిన తర్వాతి ఓవర్లో వెంకటేశ్ అయ్యర్‌ రెండు ఫోర్లు కొట్టాడు. ఆరో ఓవర్‌ వేసిన శార్దూల్ ఠాకూర్‌ వెంకటేశ్ అయ్యర్‌ని ఔట్‌ చేసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. తర్వాత స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. మోర్గాన్‌ (8) నిరాశపర్చగా.. జడేజా వేసిన 13వ ఓవర్లో త్రిపాఠి క్లీన్‌బౌల్డయ్యాడు. అనంతరం రసెల్‌ (20; 15 బంతుల్లో 2×4, 1×6) వేగంగా ఆడబోయి 17వ ఓవర్లో ఔటయ్యాడు. దినేశ్ కార్తీక్‌ (26; 11 బంతుల్లో 3×4, 1×6) చివర్లో దూకుడుగా ఆడాడు. దీపక్ చాహర్‌ వేసిన 18వ ఓవర్‌లో రాణా రెండు ఫోర్లు బాదాడు. సామ్‌కరన్‌ వేసిన 19వ ఓవర్లో దినేశ్‌ కార్తీక్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదాడు. హేజిల్‌వుడ్‌ వేసిన చివరి ఓవర్‌లో కార్తీక్‌ ఔటయ్యాడు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo