close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సమంత వన్‌ బకెట్‌ ఛాలెంజ్‌

నీటి ఎద్దడితో రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. దాహార్తి కోసం చెన్నైవాసులు రోజుల తరబడి నీటి ట్యాంకుల కోసం బారులు తీరుతున్నారు. వర్షాభావంతో జలాశయాలు ఎండిపోవడంతో చాలాచోట్ల ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉందంటోంది నటి సమంత. మంచి నీటిని వృథా చేయకుండా ఉంటే నీటిఎద్దడిని నివారించొచ్చని ముందుకు వచ్చిందీ అందాల నటి. మాటల్లో చెప్పడమే కాదు... తన అభిమానులందరికీ ట్విటర్‌లో ఓ ఛాలెంజ్‌ విసిరి దాన్ని అనుసరించమంటోంది. ‘హైదరాబాద్‌ ఈజ్‌ రన్నింగ్‌ డ్రై’ శీర్షికతో కుళాయి నుంచి జారుతున్న నీటి చుక్క ఫొటోను   పోస్ట్‌ చేసి వన్‌ బకెట్‌ ఛాలెంజ్‌ గురించి చెప్పింది.  రాష్ట్రాలే కాదు... దేశమంతా భవిష్యత్తులో నీటి సమస్యను ఎదుర్కోకుండా ఉండాలంటే ‘వన్‌ బకెట్‌ ఛాలెంజ్‌’ తీసుకోవాలని సమంత  ట్విటర్‌ ద్వారా పిలుపునిచ్చింది.  అంటే... జూలై 21 ఆదివారం రోజున ఒక బకెట్‌ నీటితోనే తన నిత్యకృత్యాలన్నీ తీర్చుకోబోతున్నానని, నీటిని పొదుపుగా ఎలా వాడొచ్చో వివరిస్తానని అంటోంది. ఇతరులూ దీన్ని అనుసరించాలని, నిజాయతీగా తమ గురించీ ట్విటర్‌లో పోస్టు చేయాలని చెబుతోంది.


మరిన్ని