close

తాజా వార్తలు

కశ్మీర్‌ను విభజించిన తీరు రాజ్యాంగ విరుద్ధం

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా

సోన్‌భాద్రా(ఉత్తర్‌ప్రదేశ్‌): జమ్ము కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తీరు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాటించాల్సిన విలువలను పాటించకుండా ఆర్టికల్‌ 370ని ఏకపక్షంగా రద్దు చేశారని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగ విలువలను కాపాడే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన విధానాన్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించిందంటూ మీడియాతో మాట్లాడుతూ ప్రియాంకా స్పష్టం చేశారు. 370 రద్దుపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. జ్యోతిరాదిత్య సింధియా, జనార్దన్‌ ద్వివేది, దీపేందర్‌ హూడా లాంటి కాంగ్రెస్‌ సీనియర్ నేతలు కేంద్రం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయాన్ని సమర్థించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు