logo

West Godavari: పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్‌

సరైన బిల్లులు లేకుండా, రవాణా చేసే వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా బంగారం, వెండి వస్తువులను తరలిస్తున్న వాహనాన్ని ఎస్‌ఎస్‌టీ అధికారుల బృందం పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.17కోట్ల విలువైన వస్తువులను సీజ్‌ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.

Published : 04 May 2024 06:11 IST

అట్టపెట్టెల్లో ఉన్న బంగారాన్ని తనిఖీ చేస్తున్న ఎస్‌ఎస్‌టీ బృందం

పిఠాపురం, న్యూస్‌టుడే: సరైన బిల్లులు లేకుండా, రవాణా చేసే వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా బంగారం, వెండి వస్తువులను తరలిస్తున్న వాహనాన్ని ఎస్‌ఎస్‌టీ అధికారుల బృందం పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.17కోట్ల విలువైన వస్తువులను సీజ్‌ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు టోల్‌ ప్లాజా వద్ద ఎస్‌ఎస్‌టీ బృందం తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో విశాఖపట్నం నుంచి కాకినాడ వస్తున్న  సీక్వెల్‌ లాజిస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన వాహనం వారికి కనిపించింది. వెంటనే తనిఖీలు చేపట్టగా.. అందులో బంగారు, వెండి వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సరైన ధ్రువపత్రాలు చూపకపోవడం, తరలించే వ్యక్తుల పేర్లూ పత్రాల్లో నమోదు చేయకపోవడంతో వాహనాన్ని సీజ్‌ చేసి పిఠాపురం తహసిల్దార్‌ కార్యాలయానికి తరలించారు. పంచనామా అనంతరం సీజ్‌ చేసిన ఖజానా కార్యాలయానికి తరలించారు. కార్యక్రమంలో ఫ్ల్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి వెంకటేశ్వరరావు, తహసీల్దారు లక్ష్మీ, సీఐ శ్రీనివాస్‌, ఎస్సై మురళీ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని