logo

ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్య ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated : 04 May 2024 06:53 IST

తుర్కయంజాల్‌ పురపాలిక, న్యూస్‌టుడే: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్య ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత భారాస ప్రభుత్వం ఆయనకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనాన్ని ప్రకటించింది. 2022లో ‘పద్మశ్రీ’ అవార్డు వచ్చింది. దీంతో అప్పటి సర్కారు మొగిలయ్యకు రూ.కోటి గ్రాంటు, 600 చ.గజాల స్థలం కేటాయించింది. ప్రస్తుత పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ మొగిలయ్యను పలకరించగా..  రూ.కోటి గ్రాంటు మంజూరైనా.. ఇంటి స్థలం ఇంతవరకు ఇవ్వలేదని చెప్పారు. రూ.కోటితో తుర్కయంజాల్‌లో 95 చ.గజాల స్థలం కొనుగోలుచేసి ఇంటి నిర్మాణం చేపడుతున్నానని, అదీ  చాలక అసంపూర్తిగా ఉందన్నారు.  ఇటీవలే రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డికి తన పరిస్థితి వివరించగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. దీనిపై భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ వివరణ ఇస్తూ.. మొగిలయ్యను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు నెలనెలా రూ.10 వేలు పింఛను ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని