close

ఆంధ్రప్రదేశ్

చోడిలో రెండు నూతన వంగడాల సృష్టి

అనకాపల్లి, న్యూస్‌టుడే: చోడి పంటలో (రాగులు) అధిక దిగుబడులనిచ్చే 2 కొత్త వంగడాలను విజయనగరం పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు సృష్టించారు. రాష్ట్ర స్థాయిలో వీఆర్‌ 988 (సువర్ణముఖి)ని, జాతీయ స్థాయిలో వీఆర్‌ 929 (వేగావతి)ని గురువారం విడుదల చేశారు. వివరాలను ఉత్తరకోస్తా మండల పరిశోధన సహ సంచాలకురాలు పి.జమున తెలిపారు. కొత్త వంగడాలను ఖరీఫ్‌లో జూన్‌, జులైలో, రబీలో అక్టోబరు, నవంబరులో వేసుకోవచ్చు. చోడిలో ప్రధాన సమస్య అయిన అగ్గి తెగులును ఈ కొత్త వంగడాలు తట్టుకుంటాయి.
* 115 రోజుల్లో కోతకు వచ్చే వేగావతి వంగడం హెక్టారుకు 38 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
* సువర్ణముఖిలో ఇనుము ఎక్కువ. దీన్ని అంబలిగా (రాగి మాల్టు) చేసుకుని తాగవచ్చు. 105 నుంచి 110 రోజుల్లో కోతకు వస్తుంది. దిగుబడి 30 నుంచి 35 క్వింటాళ్లు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు