బంగారంలో మదుపు చేయాలంటే...

మా అమ్మాయి వయసు 13. తన అవసరాల కోసం బంగారంలో మదుపు చేయాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.30వేల వరకూ మదుపు చేయగలం. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?

Published : 15 Mar 2024 01:32 IST

మా అమ్మాయి వయసు 13. తన అవసరాల కోసం బంగారంలో మదుపు చేయాలన్నది ఆలోచన. దీనికోసం నెలకు రూ.30వేల వరకూ మదుపు చేయగలం. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?

- సుష్మ

 ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ అవసరాలకు తగిన ఆర్థిక రక్షణ కల్పించండి. ఇందుకోసం కుటుంబ పెద్ద పేరుపై తగినంత జీవిత బీమా పాలసీ తీసుకోండి. మీ అమ్మాయి వివాహం సమయంలో అవసరమైన బంగారాన్ని జమ చేయాలనుకుంటే.. అప్పటికి ఎంత అవసరం అవుతుందో లెక్క వేసుకోండి. దాని ఆధారంగా గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. మిగతా మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. ఈ విధంగా చేస్తే, బంగారంతోపాటు, ఇతర అవసరాలకూ డబ్బు జమ అవుతుంది.


నాలుగేళ్ల క్రితం గృహరుణం తీసుకున్నాను. ప్రస్తుతం రూ.30 లక్షల వరకూ అసలు ఉంది. ఏడాదికి రూ.2 లక్షలు అదనంగా చెల్లిస్తే మంచిదేనా? లేకపోతే ఏదైనా పెట్టుబడులు పెట్టాలా?

- ప్రదీప్‌

ప్రస్తుతం గృహరుణం వడ్డీ రేట్లు 8.5 శాతం నుంచి 9 శాతం వరకూ ఉన్నాయి. గృహరుణానికి చెల్లించే వడ్డీకి రూ.2లక్షల వరకూ మినహాయింపు లభిస్తుంది. ఇందుకోసం మీకు రూ.25 లక్షల వరకూ రుణం ఉంటే సరిపోతుంది. కాబట్టి, గృహరుణానికి రూ.5లక్షలు చెల్లించండి. పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే.. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. ఏడెనిమిదేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని తీసుకొని, గృహరుణానికి చెల్లించే ఏర్పాటు చేసుకోండి.
- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని