Economy: ఒడుదొడుకులున్నా.. పుంజుకుంటాం - Economy will gain momemtum despite odds due to 2nd wave
close

Published : 27/06/2021 21:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Economy: ఒడుదొడుకులున్నా.. పుంజుకుంటాం

ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేష్‌ ఖారా ఆశాభావం

దిల్లీ: రెండో దశ కరోనా మహమ్మారి విజృంభణ వల్ల వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ దెబ్బతిన్నప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)’ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ ప్రాణనష్టం, ఉపాధి కోల్పోవడం వంటి కారణాల వల్ల 2020లో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 3.3 శాతం కుంగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. భారతదేశ జీడీపీ సైతం 2021 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం కుచించుకుపోయినట్లు ప్రస్తావించారు. ఈ తరుణంలోనే మార్చి నుంచి రెండో దశ ఉద్ధృతి ప్రారంభమైందని తెలిపారు.

అయితే, ఈ కష్ట సమయాల్లో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)’, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు మెరుగైన వృద్ధి సాధించేందుకు దోహదం చేసేలా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రెండో దశ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. ఈ ఆర్థిక సంవత్సరం పుంజుకునేందుకు దేశ ఆర్థిక వ్యవస్థ సిద్ధంగా ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. దేశీయంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం వినియోగదారులకు నిరంతర సేవలు అందించాయన్నారు. బ్యాంకింగ్‌ రంగం తీసుకున్న ముందస్తు చర్యలు అందుకు దన్నుగా నిలిచాయన్నారు. ఇది బ్యాంకుల వార్షిక, త్రైమాసిక ఫలితాల్లోనూ స్పష్టమైందన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని