రిలయన్స్‌-ఫ్యూచర్‌ డీల్‌కు మరో 6 నెలలు - Reliance Retail extends deadline to complete deal with Future Group
close

Updated : 02/04/2021 18:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిలయన్స్‌-ఫ్యూచర్‌ డీల్‌కు మరో 6 నెలలు

దిల్లీ : కిశోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌తో కుదిరిన కొనుగోలు ఒప్పందాన్ని పూర్తిచేయడానికి సమయాన్ని రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ మరో ఆరు నెలల పాటు పొడిగించింది. గతంలో నిర్దేశించిన మార్చి 31, 2021 తేదీని సెప్టెంబరు 30, 2021కి మార్చినట్లు రిలయన్స్‌ ప్రకటించింది.

ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, హోల్‌సేల్‌, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.24,713 కోట్లు. ఇదిలా ఉంటే.. ఫ్యూచర్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థల్లో అమెజాన్‌కు వాటాలున్నాయి. దీంతో ఫ్యూచర్‌ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు లభించింది. ‌ఆ తర్వాత ఒప్పందం అమలు విషయంలో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. దీంతో ఒప్పంద ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే రిలయన్స్‌ గడువును పొడిగించాల్సి వచ్చింది.మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని