GST: జీఎస్‌టీ రేట్ల మార్పు ఉంటుంది - gst rates may come down says KV Subramanian
close

Published : 30/07/2021 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

GST: జీఎస్‌టీ రేట్ల మార్పు ఉంటుంది

ద్రవ్యోల్బణం తగ్గొచ్చు 
ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌

దిల్లీ: ప్రభుత్వ అజెండాలో జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణ ఉందని.. కచ్చితంగా జరుగుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్‌ తెలిపారు. మూడు రేట్ల వ్యవస్థ అనేది చాలా ముఖ్యమని ఆయన వివరించారు. ఎక్సైజ్‌ సుంకం, సేవా పన్ను, వ్యాట్‌ వంటి డజనుకు పైగా కేంద్ర, రాష్ట్ర సుంకాలను కలిపి వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ను జులై 2017లో కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి విదితమే. ప్రస్తుతం జీఎస్‌టీలో 0.25 శాతం; 5 శాతం; 12 శాతం; 18 శాతం, 28 శాతం శ్లాబులున్నాయి. రేట్ల హేతుబద్ధీకరణ ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానంగా ‘ముందుగా అనుకున్నది మూడు రేట్ల విధానమే. అందువల్ల కచ్చితంగా రేట్ల హేతుబద్ధీకరణ ఉంటుంది. ఇన్వర్టెడ్‌ సుంకాల విధానం కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వం కచ్చితంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా’నని ఆయన అన్నారు. జులైలో టోకు ద్రవ్యోల్బణం 6 శాతం దిగువకు వస్తుందని.. 5 శాతంపైన కొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని సుబ్రమణియన్‌ అంచనా వేశారు. మూడు త్రైమాసికాలుగా ఆర్‌బీఐ నిర్దేశించిన గరిష్ఠ లక్ష్యం కంటే అధికంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదవుతున్న సంగతి తెలిసిందే.  


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని