దానిపై ఆయన చింతిస్తున్నారని తెలిసింది: స్టాలిన్‌ - DMK chief reserves comment on actor’s political plunge
close
Published : 08/12/2020 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దానిపై ఆయన చింతిస్తున్నారని తెలిసింది: స్టాలిన్‌

ఆయన పార్టీ విధానం తెలిశాక స్పందిస్తా..

చెన్నై: కొత్త సంవత్సరంలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తానంటూ సూపర్ స్టార్ రజనీ కాంత్ చేసిన ప్రకటనపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సోమవారం స్పందించారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చన్నారు. అలాగే తన రాజకీయ సలహాదారుని ఎంపికపై రజనీకాంత్ చింతిస్తున్నారని తెలిసిందంటూ వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరైనా రాజకీయాల్లో చేరొచ్చు. మొదట రజనీకాంత్ రాజకీయ పార్టీని పెట్టి, రాజకీయ విధానాన్ని చెప్పనివ్వండి. అప్పుడు నేను దానిపై మాట్లాడతాను. తమిళరువి మనియన్‌ను రాజకీయ సలహాదారుగా ఎంపిక చేయడంపై  రజనీకాంత్ చింతిస్తున్నారని నాకు తెలిసింది’ అంటూ మీడియాతో వ్యాఖ్యానించారు. 

కాగా, కొన్ని నెలల సందిగ్ధత తరవాత..కొత్త సంవత్సరంలో రాజకీయ పార్టీని ప్రకటిస్తానని ఇటీవల రజనీ వెల్లడించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా చెప్పారు. తమిళనాడు తలరాతను మార్చాల్సిన సమయం ఆసన్నమైందని, రాజకీయాలను, ప్రభుత్వాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ మార్చలేం.. మారుస్తాం..అన్నింటినీ మారుస్తాం’ అంటూ రజనీ రాజకీయ అరంగ్రేటం చేస్తూ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని