దుబాయ్‌లో ఎయిరిండియా విమానాలపై నిషేధం - Dubai suspends Air India Express flights till Oct 2
close
Published : 19/09/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దుబాయ్‌లో ఎయిరిండియా విమానాలపై నిషేధం

కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంతో నిర్ణయం

దిల్లీ: కొవిడ్ నిబంధనలపై నిర్లక్ష్యం వహించిన ఎయిరిండియా విమానాలపై దుబాయ్‌ పౌర విమానయాన శాఖ వేటు వేసింది. అక్టోబర్‌ 2 వరకు ఈ విమానాల రాకలపై నిషేధం విధించింది. కొవిడ్ పాజిటివ్ ధ్రువపత్రాలు కలిగినా కూడా గడిచిన రెండు వారాల్లో ఇద్దరు ప్రయాణికులను తీసుకొచ్చిందని పేర్కొంది. కరోనా నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అక్టోబర్ 2 వరకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వాధికారులు శుక్రవారం వెల్లడించారు.

భారత్‌ నుంచి దుబాయ్‌కి ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రాన్ని తీసుకురావాలని యూఏఈ ప్రభుత్వం గతంలోనే పేర్కొంది. ‘సెప్టెంబర్‌ 2వ తేదీన పాజిటివ్‌గా నిర్ధరణ అయిన ఓ ప్రయాణికుడు సెప్టెంబర్‌ 4న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో జైపూర్‌ నుంచి దుబాయ్‌ చేరుకున్నాడు. గడిచిన రెండు వారాల్లో ఈ తరహా ఘటన జరగడం ఇది రెండోసారి’ అని ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలను సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా నిర్ణయంపై భారత ప్రభుత్వరంగ విమానయాన సంస్థ స్పందించింది. ప్రయాణికులకు కలిగే ఇబ్బందులు తొలగించడంపై దృష్టిసారించినట్లు పేర్కొంది. శుక్రవారం భారత్‌ నుంచి షార్జాకు వెళ్లాల్సిన నాలుగు విమానాలను అనుమతించాలని దుబాయ్‌ పౌర విమానయాన శాఖను కోరింది.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని