నాన్న, చెల్లి నాపై ఆధారపడతారనుకోలేదు..!
close
Published : 28/05/2020 18:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాన్న, చెల్లి నాపై ఆధారపడతారనుకోలేదు..!

నా బాధ్యత మరింత పెరిగింది: జాన్వీ కపూర్‌

ముంబయి: తన తల్లి శ్రీదేవి అకాల మరణం తర్వాత తండ్రి బోనీ కపూర్‌, సోదరి ఖుషీ కపూర్‌ కొంతవరకూ తనపై ఆధారపడుతున్నారనే విషయం ఇప్పటివరకూ తెలియదని నటి జాన్వీ కపూర్‌ అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి బ్రేక్‌ దొరకడంతో ఇంటికే పరిమితమైన జాన్వీ తన తండ్రి, సోదరితో సరదాగా గడుపుతున్నారు. ఇంట్లోనే ఉంటూ తన తండ్రి, సోదరికి సంబంధించిన అన్ని విషయాల గురించి జాన్వీ తెలుసుకుంటున్నారు. బోనీ కపూర్‌ ఎలాంటి ఆహారం తీసుకుంటారు. ఖుషీ కపూర్‌ వ్యాపకాలు.. ఇలా ఇంటికి, ఇంట్లో వాళ్లకి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. 

కాగా, తాజాగా జాన్వీ ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఇంటిలో అందరి యోగక్షేమాలు చూసుకునే మహిళనవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నాది చిన్న పిల్ల మనస్తత్వం. కానీ లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోవాళ్లు నాపై ఎంతగా ఆధారపడుతున్నారో తెలుసుకున్నాను. గడిచిన రెండేళ్లలో ఇంత ఎక్కువ సమయం వాళ్లతో గడిపింది ఇప్పుడే. నాన్న ఏం తింటారు, ఖుషీ ఎక్కువ సమయం ఎందుకు నిద్రపోతుంది, ఇంట్లో ఉండే పనివాళ్లు కూరగాయలకు ఎలా తీసుకువస్తున్నారు? అన్నీ శుభ్రంగా కడుగుతున్నారా? కరోనా రాకుండా ప్రభుత్వం చెబుతున్న నియమాలను పాటిస్తున్నారా? ఇలా ప్రతీ విషయాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తున్నాను. ఒకవేళ నేనిక్కడ లేకపోతే ఎలా ఉండేదా? అని అప్పుడప్పుడూ ఆలోచిస్తుంటాను. ప్రస్తుతం వాళ్లు నాపై కొంతవరకూ ఆధారపడుతున్నారనే విషయం తెలియడంతో నా బాధ్యత మరింత పెరిగిందనే చెప్పాలి’ అని జాన్వీ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని