కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు తొందరక్కర్లేదు: ఖుర్షీద్‌ - No urgency to have an elected Congress president: Khurshid
close
Published : 31/08/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు తొందరక్కర్లేదు: ఖుర్షీద్‌

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలను ఇప్పటికిప్పుడే నిర్వహించాల్సిన అవసరమేమీ లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత,  కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఉన్నారని, పార్టీ నాయకత్వంపై ఆమె తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ మేరకు ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఈ సందర్భంగా సీనియర్లు లేఖ రాసిన అంశాన్ని ప్రస్తావించారు. ఒకవేళ ఆ గ్రూపు తన వద్దకు వచ్చినా తాను సంతకం చేసేవాడిని కాదని చెప్పారు. సోనియాకు ఆ నేతలు లేఖ రాయకుండా నేరుగా కలిసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ‘‘ఇప్పటికే సోనియా, రాహుల్‌ ఉన్నారు. ఇప్పటికిప్పుడు అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. జరగాల్సినప్పుడు అదే జరుగుతుంది. ఇప్పటికైతే కొంపలైతే ఏమీ అంటుకోవు. కానీ వారెందుకు తొందరపడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు’’ అని ఖుర్షీద్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ  ఒకప్పుడు పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన వారేనని ఖుర్షీద్‌ గుర్తుచేశారు. అధ్యక్ష ఎన్నికల అంశంపై సరైన సమయంలో ఆమే తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాహుల్‌ మళ్లీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని కొందరు నేతలు అభ్యర్థనలు చేయడం మానేసి ఆ నిర్ణయాన్ని ఆయనకే విడిచిపెట్టాలని ఖుర్షీద్‌ సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని