close
Published : 03/08/2020 09:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సోనూ హీరో అవుతాడని పూరికి ముందే తెలుసా!

హైదరాబాద్‌: ఒకప్పుడు తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఆయనొక విలన్‌గానే తెలుసు. కానీ, ఇప్పుడు ఆయనను ఎవరైనా అలా అంటే ఒప్పుకోరు. ఆయన వెండితెరపైనే విలన్‌ కావచ్చు... కానీ నిజ జీవితంలో చాలా మందికి ఆయనొక హీరో.. ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే తెలిసి ఉంటుంది. బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌.

లాక్‌డౌన్‌, పేదరికం, వైద్యం, విద్య, వ్యవసాయం అవసరం ఏదైనా సాయం చేయడంలో ముందుంటున్నారు సోనూసూద్‌.  ఈ విషయం మాస్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ముందే కనిపెట్టారని అంటున్నారు నెటిజన్లు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఏక్‌ నిరంజన్‌’ అందులో సోనూ ప్రతినాయకుడిగా నటించాడు. ఓ సన్నివేశంలో సోనూ చెప్పిన సంభాషణల వీడియోను పంచుకుంటూ పూరి జగన్నాథ్‌కు ట్యాగ్‌ చేశారు. ఇది చూసిన పూరి ‘నాకు తెలుసు.. సోనూ ఎప్పుడూ హీరోనే’ అని ఆ ట్వీట్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది.

లాక్‌డౌన్‌ తర్వాత తెరకెక్కిన ది కపిల్‌ శర్మ షోలో సోనూసూద్ పాల్గొన్నారు. తాజాగా తాను చేసిన సాయం గురించి మాట్లాడుతూ.. దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదని దేవుడు ఆ పని చేయడానికి తనని ఎంపిక చేసుకున్నాడని సోనూసూద్‌ తెలిపారు.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని