మాస్కుపై అవగాహనకు గాంధీజీ అవతారం - a retaired employee in ananthapur creating awareness on wearing mask with gandhiji appearence
close
Published : 20/04/2021 10:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్కుపై అవగాహనకు గాంధీజీ అవతారం

గుత్తి: కరోనా విలయతాండవం చేస్తున్నా కొందరు కళ్లు తెరవడం లేదు. మాస్కు ధరించాలని విన్నవించుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. అలాంటివారిని గాడిన పెట్టేందుకు గాంధీజీ అవతారమెత్తారు ఓ విశ్రాంత ఉద్యోగి. మహాత్ముడి వేషధారణలో మాస్కుల ఆవశ్యకతను చాటిచెబుతున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు చెందిన తిరుపతయ్య బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం చేసి గతేడాది స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఉద్యోగ జీవితాన్ని వదిలేసిన తిరుపతయ్యకు కరోనా వైరస్‌ సామాజిక కర్తవ్యాన్ని బోధించింది. కొవిడ్‌పై ప్రజల్లో పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని తగ్గించాలని ఆయన మహాత్ముడి వేషం కట్టారు. వైరస్‌పై అవగాహన కల్పిస్తూ ప్రతిఒక్కరు మాస్కు ధరించాలని కోరుతున్నారు.

గుత్తి పట్టణంలోని ప్రధాన రహదారులు, గాంధీ కూడలి వద్ద రద్దీ ప్రాంతాల్లో తిరుపతయ్య ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి బస్సుల్లోని ప్రయాణికులకు జాగ్రత్తలు చెబుతున్నారు. మహమ్మారికి ఎవరూ బలవ్వకూడదనేదే తన ప్రయత్నమంటున్నారు తిరుపతయ్య.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని