కంటికి కనిపించని దుష్టశక్తితో పోరాటం.. ఉత్కంఠ రేపుతున్న ‘చతుర్ముఖం’ ట్రైలర్‌ - chathur mukham telugu trailer manju warrier
close
Published : 10/08/2021 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కంటికి కనిపించని దుష్టశక్తితో పోరాటం.. ఉత్కంఠ రేపుతున్న ‘చతుర్ముఖం’ ట్రైలర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్య కాలంలో మలయాళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పుడు మరో మలయాళ చిత్రం ఇక్కడ ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. మంజు వారియర్‌, సన్నీ వెనె, శ్రీకాంత్‌ మురళి ప్రధానపాత్రలు పోషించిన ‘చతుర్ముఖం’ ఏప్రిల్‌లో విడుదలై ప్రశంసలు అందుకుంది. రంజిత్ కామ‌ల శంక‌ర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తెలుగు అభిమానుల కోసం ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ డబ్‌ చేసింది. ఈ నెల 13 నుంచి అందుబాటులోకి రానుంది. కాగా.. తాజాగా చిత్ర ట్రైలర్‌ను ఆహా యూట్యూబ్‌ వేదికగా పంచుకుంది.

జీవితంలో ఒక అమ్మాయికి కావాల్సినవి విద్య, ఆర్థికంగా బాగా ఉండటం.. ఈ రెండూ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి.. అనే సంభాషణతో సాధారణంగా ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌.. ఉత్కంఠ రేపుతూ సాగుతుంది. దెయ్యాలు, భూతాలున్నాయంటే నమ్మని ఓ మధ్య తరగతి అమ్మాయిని ఏదో కనిపించని శక్తి వెంటాడుతూ ఉంటుంది. తన ఫోన్లోనే తనకు తెలియకుండా దూరిపోయి ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ అమ్మాయి ఆ శక్తిని ఎలా ఎదురించింది. ఆమె ఎలాంటి ఇబ్బందులు పడింది అనేదే కథ.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని