Tokyo Olympics: తొలి స్వర్ణం ముద్దాడింది చైనా షూటరే - chinas yang qian wins womens 10m air rifle gold
close
Updated : 24/07/2021 16:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: తొలి స్వర్ణం ముద్దాడింది చైనా షూటరే

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల వేట మొదలైంది. మెగా క్రీడల్లో మొదటి స్వర్ణాన్ని చైనా ముద్దాడింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో యాంగ్‌ కియాన్‌ విజయం సాధించింది. రష్యన్‌ (రష్యా ఒలింపిక్‌ కమిటీ) షూటర్‌ గలాషినా అనస్టాసియాను స్వల్ప తేడాతో ఓడించింది. అర్హత రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన డ్యూస్టాడ్‌ నాలుగో షూటర్‌గా వెనుదిరిగింది.

ఫైనల్‌ పోరు హోరాహోరీగా సాగింది. యాంగ్‌, అనస్టాసియా నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. వీరిద్దరి మధ్య పోరు 125.6-126.0, 147.3-146.2, 168.3-167.6, 188.9-189.1, 210.0-210.5, 231.3-231.4తో సాగింది. ఏడో సెషన్‌కు ముందు వీరి మధ్య తేడా 0.1 పాయింట్లే. అయితే ఆఖరి సెషన్‌ తొలి షూట్లో అనస్టాసియా 10.8 పాయింట్లు సాధించింది. యాంగ్‌ 10.7కే పరిమితం కావడంతో ఆమె ఆధిపత్యం 0.2 పాయింట్లకు పెరిగింది.  అయితే చివరి షూట్లో యాంగ్‌ 9.8, రష్యన్‌ స్టార్‌ 8.9 పాయింట్లు సాధించడంతో వీరి మధ్య తేడా 251.8 - 251.1గా మారిపోయింది. యాంగ్‌ పసిడి ముద్దాడింది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రిస్టినా నీనా 230.6తో కాంస్యం సాధించింది.

నిజానికి ఈ పోటీల్లో భారత్‌కు పతకం దక్కాల్సింది. ఎందుకంటే 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్స్‌లో భారత స్టార్‌ అపూర్వీ చందేలా 252.9 పాయింట్లతో 2019లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుత ఒలింపిక్‌ విజేత అంతకన్నా తక్కువ పాయింట్లే సాధించడం గమనార్హం. అపూర్వీ అర్హత రౌండ్లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

జూడోలో నిరాశే

జూడో పోటీల్లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. టీమ్‌ఇండియా జుడోకా సుశీలా దేవి ప్రి క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. హంగేరికి చెందిన సెర్నోవిక్‌జికి ఆమెను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. 2012 లండన్‌ ఒలిపింక్స్‌లో సెర్నోవిక్‌జికి కాంస్యం గెలవడం గమనార్హం. తాజా పోరులో సుశీల శుభారంభమే చేసింది. అయితే ఆట సాగే కొద్దీ కొన్ని పొరపాట్లు చేసింది. దీనిని ఆసరాగా తీసుకున్న హంగేరియన్‌ 20 సెకన్లపాటు సుశీలను ఇప్పోన్‌ చేసింది. ప్రత్యర్థిని 180 డిగ్రీల్లో పైనుంచి కిందపడేసి అలాగే లేవకుండా ఉంచడాన్ని ఇప్పోన్‌ అంటారు. భారత్‌ నుంచి జూడోలో పోటీపడుతున్న ఏకైక క్రీడాకారిణి సుశీల ఒక్కరే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని