Chiranjeevi: ప్రతి జిల్లాలో ఆక్సిజన్‌ బ్యాంక్స్‌ - chiranjeevi oxygen banks at district level
close
Updated : 20/05/2021 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Chiranjeevi: ప్రతి జిల్లాలో ఆక్సిజన్‌ బ్యాంక్స్‌

హైదరాబాద్‌: కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అగ్ర కథానాయకుడు చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. వెండితెరపై తనదైన నటనతో అలరించడమే కాదు, అవసరమైన వారికి తన బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ ద్వారా ఆదుకుంటున్న చిరు ఇప్పుడు ఆక్సిజన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో చిరు ఆక్సిజన్‌ బ్యాంకును త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

‘‘సమయానికి రక్తం దొరక్క ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ప్రారంభించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్‌ అందక ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో చిరు ఆక్సిజన్‌ బ్యాంకు ప్రతి జిల్లాలోనూ నెలకొల్పాలని నిర్ణయించారు. వచ్చే వారం రోజుల్లో ప్రజలకి ఆక్సిజన్‌ బ్యాంకు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్ల చేస్తున్నారు’’ అని చిరంజీవి ఆఫీస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ బ్యాంకును నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వ్యవహారాలను చిరు తనయుడు రామ్‌చరణ్ పర్యవేక్షిస్తారు.

డ్రైవర్‌ కుటుంబానికి చిరు ఆర్థిక సాయం

మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. కరోనా సోకడంతో తన కరవ్యాన్‌ డ్రైవర్‌ జయరామ్‌ గత ఏప్రిల్‌లో మృతి చెందారు. ఆయనకు భార్య శోభారాణి, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. జయరామ్‌ మరణంతో ఆ కుటుంబం కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయింది. విషయం తెలుసుకున్న చిరంజీవి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. జయరామ్‌ కుటుంబ సభ్యులను చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కు పిలిపించి వాళ్లకు రూ.లక్ష చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ.. తమ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా చిరంజీవి అండగా ఉన్నారని చెప్పింది. గతంలో కూడా ఒకసారి బైక్‌ మీద వెళుతూ తన భర్త గాయాల పాలైనప్పుడు ఉపాసన ఆర్థిక సాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఆదుకున్నందుకు ఆమె చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని