Delhi corona: మూడో రోజూ 10వేలలోపే - delhi registers 6456 new covid-19 cases 262 more deaths
close
Published : 16/05/2021 23:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Delhi corona: మూడో రోజూ 10వేలలోపే

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా 6,456 మంది కరోనా బారిన పడగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ 262మంది మృతి చెందారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 10.40శాతంగా ఉందని దిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. వరుసగా మూడో రోజు 10వేలలోపు కరోనా కేసులు నమోదవడం గమనార్హం. శనివారం కూడా 6,430 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 7వ తేదీ తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

బ్లాక్‌ఫంగస్‌ కట్టడికి ప్రత్యేక చర్యలు: కేజ్రీవాల్‌

కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్‌ఫంగస్‌ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరగకుండా సత్వర చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. దిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. మ్యుకర్‌మైసోసిన్‌నే సాధారణ పరిభాషలో బ్లాక్‌ఫంగస్‌ అంటారు. ఇదొక ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. కరోనా కారణంగా ఈ ఫంగస్‌ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది. కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లను వాడటంతో పాటు డయాబెటిస్‌ (షుగర్‌) ఉన్న వారిలో ఇది ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని