close
Published : 11/02/2021 20:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిధ్‌ గాత్రంతో.. తొలి జానపదం

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ‘ఇంకేం ఇంకేం కావాలే’, ‘ఉండిపోరాదె’, ‘అరెరె మనసా’, ‘సామజవరగమన’ వంటి ఎన్నో హిట్‌ మెలొడీలు ఆలపించిన సిధ్‌ శ్రీరామ్‌ నుంచి ఓ జానపద గీతం రాబోతుంది. ‘ఏమున్నవే పిల్ల’ అంటూ సాగే హుషారైన పాటను ‘నల్లమల’ చిత్రం కోసం పాడారాయన. తాజాగా ఈ పాటకు సంబంధించి గ్లింప్స్‌ విడుదలైంది. 33సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సాహిత్యం లేకుండా సంగీతం, సిధ్‌ స్వరం మాత్రమే వినిపిస్తాయి. అయినా విడుదలైన కొన్ని క్షణాల్లోనే యూట్యూబ్‌లో అధిక వీక్షణలు సొంతం చేసుకుని సిధ్‌కు ఉన్న క్రేజ్‌ ఏంటో చూపించింది.

సిధ్‌ శ్రీరామ్‌ కెరీర్‌లో తొలి ఫోక్‌ సాంగ్‌ ఇదే కావడంతో సంగీత అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన గానం విన్న శ్రోతలు ‘చాలా బాగుంది’, ‘పూర్తి పాట కోసం వేచిచూస్తున్నాం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో  కామెంట్లు పెడుతున్నారు. పూర్తి గీతం ఫిబ్రవరి 13న ఉదయం గం:11.10ని.లకు సంగీత ప్రపంచంలోకి రానుంది. ఈ పాటకు సంగీతం, సాహిత్యం పి.ఆర్‌ సమకూర్చారు. అమిత్‌ తివారి, భానుశ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రమే ‘నల్లమల’. రవి చరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నమో క్రియోషన్స్‌ పతాకంపై ఆర్‌.ఎం. నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి..

క్రేజీ కాంబోలో భారీ ప్రాజెక్ట్‌లు ఫిక్స్‌

 



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని