ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రేలిస్టుల్లో ఉన్నా.. 
close
Published : 25/02/2020 16:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రేలిస్టుల్లో ఉన్నా.. 

 మారిషస్‌ నిధులపై సెబీ స్పష్టత

ఇంటర్నెట్‌డెస్క్‌: మారిషస్‌ దేశం ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రేలిస్ట్‌లో ఉన్న నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చే విదేశీ పెట్టుబడులకు సంబంధించి మంగళవారం సెబీ స్పష్టతనిచ్చింది. అక్కడి పెట్టుబడిదారులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని పేర్కొంది.  ఇటీవల ఆ దేశాన్ని ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రేలిస్టులో కొనసాగించనున్న విషయం తెలిసిందే. వీటికి సంబంధించి కేవైసీ నిబంధనలు సంతృప్తి పర్చడం, సెక్యూరిటీ నిబంధనలు పూర్తి చేయడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుందని సెబీ పేర్కొంది. అనుమానాస్పద నిధులను గుర్తించేందుకు వీలుగా సెబీ వీటికి రిజిస్ట్రేషన్‌ను సూచించింది. 

గతవారం ఎఫ్‌ఏటీఎఫ్‌ కార్యనిర్వహణ విభాగం సమావేశమై మారిషస్‌ను గ్రేలిస్ట్‌లో కొనసాగించాలని నిర్ణయించింది.  ముఖ్యంగా మనీలాండరింగ్‌ను కట్టడి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకొంది. కాకపోతే ఇప్పుడు మారిషస్‌ నుంచి నిధులను సురక్షిత దేశాలకు మళ్లించాలనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో సెబీ రిజిస్ట్రేషన్‌ అమలు చేస్తుండటంతో వారు ఇతర ప్రాంతాలను వెతుక్కొనే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే మారిషస్‌ నుంచి వచ్చే నిధులపై ప్రభుత్వం అదనపు పన్ను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. 2019లో మారిషస్‌ నుంచి భారత్‌కు రూ.4.3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. భారత్‌కు అత్యధిక పెట్టుబడులు పెట్టిన  దేశాల్లో అమెరికా తర్వాత స్థానంలో మారిషస్‌ నిలిచింది. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని