ఆ రోజు నాకిప్పటికీ గుర్తుంది!
close
Published : 15/06/2020 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రోజు నాకిప్పటికీ గుర్తుంది!

వెంకీ అట్లూరి

హైదరాబాద్‌: తొలి సినిమాతోనే సూపర్‌హిట్‌ అందుకున్న యువ కథానాయకుడు నితిన్‌. ఆయన నటించిన ‘జయం’ 2002 జులై 14న విడుదలై... ప్రేక్షకుల మన్ననలు పొందింది. సదా కథానాయికగా నటించిన ఈ సినిమాలో గోపీచంద్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఈ చిత్రం తర్వాత నితిన్ ‘దిల్‌’, ‘సై’, ‘ఇష్క్‌’ తదితర సినిమాలతో కథానాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన కెరీర్ ఆరంభించి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి ప్రత్యేక పోస్ట్‌ చేశారు. ‘‘జయం’ విడుదలైన తర్వాత 120వ రోజున.. హౌస్‌ఫుల్‌గా ఉన్న హైటెక్‌ థియేటర్‌లో సినిమా చూశా. అప్పటి నుంచి నువ్వు కెరీర్‌ పరంగా ఎత్తుపల్లాలు చూశావ్‌.. అదేవిధంగా నీ లవ్లీ ఫిల్మ్స్‌ బాక్సాఫీసు వద్ద రికార్డులు కూడా సృష్టించాయి. తెలుగు సినీ పరిశ్రమలో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు నితిన్‌. పరిస్థితులు చక్కబడిన తర్వాత ‘రంగ్‌దే’ సెట్‌లో నిన్ను కలవడం కోసం ఎదురుచూస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.

నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న సినిమా ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. గత ఏడాది అక్టోబరు 8 నుంచి చిత్ర షూటింగ్‌ జరుగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. మరోపక్క నితిన్‌, చంద్రశేఖర్‌ ఏలేటి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతోంది. నితిన్‌ ఇటీవల ‘భీష్మ’తో హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని