‘ఏజెంట్‌’ కోసం...
close
Published : 29/07/2021 04:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఏజెంట్‌’ కోసం...

నిన్న మొన్నటిదాకా లవర్‌బాయ్‌గా కనిపించాడు అఖిల్‌ అక్కినేని. ‘ఏజెంట్‌’ కోసం సరికొత్తగా మారాడు. కండలు పెంచడంతోపాటు మరింత స్టైలిష్‌గా మారిపోయాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘ఏజెంట్‌’ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోంది. సాక్షి వైద్య నాయిక. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సరెండర్‌ 2 సినిమా సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. రామబ్రహ్మం సుంకర నిర్మాత. వక్కంతం వంశీ కథని అందించారు. ఇప్పటికే పట్టాలెక్కిన ఈ సినిమా కోసం అఖిల్‌ త్వరలోనే ప్రయాణం కట్టనున్నారు. ఆగస్టు 3, 4 తేదీల్లో కృష్ణపట్నం పోర్ట్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఇన్‌స్టాలో ‘ఏజెంట్‌’ లుక్‌తో కనిపిస్తున్న తన స్టిల్‌ని పంచుకున్నారు అఖిల్‌.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని