ఇక్కడ నెగ్గుకురావడం సులభం కాదు: కంగన
ఆ పెద్దావిడ కన్నీరు.. నా కష్టాల్ని గుర్తుచేసింది
ముంబయి: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. రాణించడం ఎంతో కష్టమైన విషయమని నటి కంగనా రనౌత్ అన్నారు. కెరీర్ ప్రారంభమైన కొత్తలో పలు ఇబ్బందులు ఎదుర్కొని విభిన్నమైన కథా చిత్రాలను చేసి టాప్ హీరోయిన్గా ఆమె కాంతులీనుతున్నారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తేజస్’. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కంగన వాయుసేన పైలట్‌గా కనిపించనున్నారు. సర్వేష్ మేవర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూట్ ప్రారంభమైంది.
మొదటిరోజు చిత్రీకరణలో భాగంగా మంగళవారం ఉదయం దర్శకుడి కుటుంబ సభ్యులు సెట్‌కు చేరుకుని కంగనాను కలిశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ ఫొటో షేర్ చేశారు. ‘ఓ విజయాన్ని అందుకోవడం కోసం ‘తేజస్’ దర్శకుడు సర్వేష్ మేవర ఓ దశాబ్దం పాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ‘తేజస్’ మొదటిరోజు షూట్లో భాగంగా సెట్‌కు వచ్చిన ఆయన తల్లి నాతో మాట్లాడారు. కెరీర్ ఆరంభంలో దర్శకుడు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు గురించి చెప్పి ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె కన్నీరు చూశాక.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో నేను పడిన ఇబ్బందులన్నీ గుర్తుకు వచ్చాయి. నా విజయం కోసం ఆ రోజుల్లో తల్లిదండ్రులు ఎంతలా ఎదురుచూశారో నాకు ఇప్పుడు అర్థమైంది. బయటవాళ్లు.. ఇండస్ట్రీలో విజయం సాధించడం అంత సులభంగా జరిగే పని కాదు’’ అని కంగన వివరించారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- తారక్ అభిమానులకు శుభవార్త!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా